జగనన్న నవరత్నాలు

ఈ 9 హామీలు (నవరత్నాలు) అభివృద్ధి మరియు సంతోషాల నిలయంగా న‌వ్యాంధ్ర‌ రాష్ట్ర నిర్మాణాకి పునాదులు అవుతాయని మేము నమ్ముతున్నాము.

వైఎస్సార్ ఆసరా

వైఎస్సార్ ఆస‌రా పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు ఉన్న మొత్తం రుణాలను నాలుగు దఫాలుగా మాఫీ చేస్తాము. వైయస్ ఆర్ చేయూత పథకం ద్వారా ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు తోడుగా ఉంటాము.

ఆరోగ్యశ్రీ

వైద్యం ఖ‌ర్చు రూ.1,000 దాటితే ఆరోగ్య‌శ్రీ వ‌ర్తింపు. ఎన్ని ల‌క్ష‌లు ఖ‌ర్చ‌యినా ఆరోగ్య‌శ్రీ ద్వారా పూర్తిగా ఉచిత వైద్యం

ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌

విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ తో పాటువసతి, భోజనంకోసంఅదనంగా ఏటా రూ.20 వేలుప్రతీవిద్యార్థికిఇస్తాము.

జలయజ్ఞం

పోలవరంతోసహా అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటి విప్లవాన్ని ప్రారంభిస్తాము.

పేద‌లంద‌రికీ ఇల్లు

ఇల్లు లేని పేద‌లంద‌రికీ ప‌క్కాఇళ్ళు. ఐదేళ్లలో 25లక్షల పక్కా ఇళ్ళు కట్టిస్తాం

వైఎస్సార్ రైతు భరోసా

ప్రతి రైతు కుటుంబానికి రూ. 50,000 అందిస్తాము. మే నెలలో పెట్టుబడి కోసం రూ.12,500 చొప్పున వరుసగా నాలుగేళ్ళు రెండవ సంవత్సరం నుండి ఇస్తాము.

అమ్మఒడి

పేదింటి పిల్లల చదువుల కోసం పిల్లల్నిబడికిపంపించినప్రతి తల్లికి ప్రోత్సహకం క్రింద సంవత్సరానికి రూ. 15,000ఇస్తాము.

పింఛన్ల పెంపు

ప్రస్తుతం ఉన్న పింఛన్ల వయస్సును 65 నుండి 60 కి తగ్గించడంతో పాటు, వృద్ధులకు నెలకు రూ.2000 మరియు వికలాంగులకు రూ.3000 పింఛన్లుఇస్తాము.

మద్యపాన నిషేధం

అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాము.

ముఖ్యమంత్రిగా జగనన్న

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు నాయకత్వ మార్పు కోరుకుంటూ వారికి కావలసిన ముఖ్య మంత్రిని ఎంచుకున్నారు. మాతో కలిసి జగన్ మోహన్ రెడ్డి అధికారిక ప్రచార కార్యక్రమంలో భాగమవ్వండి.

prajasankalpayatra

ప్రజా సంకల్ప యాత్ర

రాష్ట్రవ్యాప్తంగా జగనన్న పాదయాత్రను ట్రాక్ చేయండి, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పౌరుడిని కలవడం, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది!

Visit

ysrkutumbam

వైయస్ఆర్ కుటుంబం

మీరు వైయస్ఆర్ కుటుంబ సభ్యులు, మీ సమస్యలన్నీ కూడా జగనన్న అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పరిష్కరించబడును.

Visit

scs

ప్రత్యేక హోదా

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదాను సాధించుటకై జగనన్న మనందరికీ దారిని చూపిస్తారు.

Visit

jaganspeaks

జగన్ స్పీక్స్

రాష్ట్ర స్థాయిలో ప్రభావం చూపే విధంగా సమస్యలపై జగనన్న నిక్కచ్చిగా మాట్లాడుతారు.

Visit

గ్యాలరీ

మీడియా