తరచుగా అడిగే ప్రశ్నలు

తరచుగా అడిగే ప్రశ్నలు

జగనన్న ఫర్ సి.యం ఫండ్ అంటే ఏమిటి?

జగనన్న ఫర్ సి.యం ఫండ్ అనేది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమైన ప్రచార విరాళం. పార్టీ నిర్వహించే అన్ని రకాల కార్యక్రమాలకు ఈ ఫండ్ దోహదపడటంతో పాటు జగనన్నని ముఖ్యమంత్రి చేసి దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్ర స్థానంలో నిలబెట్టడానికి సహాయపడుతుంది.

జగనన్న ఫర్ సి.యం ఫండ్ కోసం ఎవరు విరాళాలను ఇవ్వచ్చును?

భారతీయ చట్టం ప్రకారం, ఇండియా లేదా విదేశాల్లో నివసించే భారత పౌరులు మాత్రమే విరాళాలను ఇవ్వచ్చును.

నేను మొదటి నుండి భారతదేశ వ్యక్తిని కానీ, భారత పౌరుడిని కాదు. నేను విరాళం ఇవ్వచ్చునా?

చట్టబద్ధంగా, భారతదేశ పౌరులు మాత్రమే తమ దేశ రాజకీయ పార్టీలకు విరాళాలను ఇవ్వడానికి అర్హులు. అయితే, ఈ ఉద్యమంలో పాల్గొని, http://www.ysrkutumbam.com/ లింక్ ద్వారా వైయస్ఆర్ కుటుంబంలో చేరాలని కోరుతున్నాము.

నేను భారత పౌరుడిని కానీ ప్రస్తుతం విదేశాల్లో నివసిస్తున్నాను. నేను విరాళం ఇవ్వచ్చునా?

విదేశాల్లో నివసించే ప్రవాస భారతీయులందరూ చెల్లుబాటు అయ్యే వారి పాస్ పోర్ట్ ద్వారా విరాళాన్ని ఇవ్వచ్చును. పౌరసత్వం ధ్రువీకరణ కోసం ప్రవాస భారతీయుల పాస్ పోర్ట్ నెంబర్ తప్పనిసరి.

జగనన్న ఫర్ సి.యం ఫండ్ కోసం నేను విరాళాన్ని ఏవిధంగా అందించాలి?

ఇప్పటివరకు, మేము ఆన్ లైన్ ద్వారానే విరాళాలను ఆమోదిస్తున్నాము. జాతీయ/అంతర్జాతీయ క్రెడిట్/డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ (భారతీయ బ్యాంకులు మాత్రమే) మరియు వాలెట్ ద్వారా విరాళాలను అందించవచ్చును.

ప్రత్యేకమైన వాటికి మాత్రమే విరాళాలను ఇవ్వచ్చునా?

అవును. క్రింది వాటిని మీరు ఎంచుకోవచ్చును:

  • స్థానిక నాయకులు
  • ప్రకటనలు, డిజిటల్ & సాంప్రదాయ మీడియా
  • ప్రత్యేక కార్యక్రమం/ర్యాలీ
  • ప్రత్యేక కార్యక్రమాలైన జగనన్న టౌన్ హాల్స్ మొదలైనవి.
  • సాధారణ ఎన్నికల ఫండ్ సహాయం