మా గురించి

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేది యువత, శ్రామిక మరియు రైతుల యొక్క కాంగ్రెస్ పార్టీ. మొదటి నుండి రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కొనసాగుతున్న ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ. ఈ పార్టీని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు, శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు 2011 లో స్థాపించారు. తన తండ్రి వైయస్ఆర్ గారి ఆశయాలను సాధించి, వాటిని అమలు పర్చాలనే దృఢ సంకల్పంతో పార్టీని స్థాపించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి ఓ కుటుంబంలా తోడుగా ఉంటూ, ప్రోత్సహిస్తూ, అధికారం అనేది కొందరి చేతిలోనే ఉండేది కాదనేది గట్టిగా నమ్ముతుంది. సంక్షేమం ప్రతి ఒక్కరికి సమానంగా జరిగేలా పోరాడుతూ ఉంటుంది.

తన తండ్రి గారిని ఇష్టపడుతూ, తండ్రి బాటలోనే ప్రజల సంక్షేమమే ధ్యేయమని నమ్మిన వ్యక్తి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు. వైయస్ జగన్ ఆకర్షణీయమైన ఒక యువ నాయకుడు. ప్రజల తరుపున నిలబడి, వారి సమస్యలపై గళం విప్పి మాట్లాడాలనేదే వైయస్ జగన్ ముఖ్య ఉద్ద్యేశం. రాజన్న రాజ్యాన్ని తిరిగి స్థాపించాలనే దృఢ సంకల్పంతో అసమానమైన కృషి చేస్తూ ఎల్లవేళలా ప్రజలకు భరోసాగా నిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికై నవరత్నాల పేరుతో రైతులు, శ్రామికులు, మహిళలు, యువకులు మరియు అన్ని ఇతర వర్గాల ప్రజలకు మేలు జరిగేలా తొమ్మిది పథకాలను ప్రవేశపెట్టారు.

జగనన్న ఫర్ సి.యం ఫండ్ అనేది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమైన ప్రచార విరాళం. పార్టీ నిర్వహించే అన్ని రకాల కార్యక్రమాలకు ఈ ఫండ్ దోహదపడటంతో పాటు జగనన్నని ముఖ్యమంత్రి చేసి దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్ర స్థానంలో నిలబెట్టడానికి సహాయపడుతుంది. రాజన్నఆశయాలను సాధించడానికి దోహదపడుతుంది.